మలయాళ ఇండస్ట్రీలోకి కరణ్ జోహార్ ఎంట్రీ.. పృథ్వీరాజ్ సుకుమారన్‌తో కలిసి భారీ మూవీ!

  • భారీ సినిమాను ప్రకటించిన ధర్మ ప్రొడక్షన్స్, పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్
  • మలయాళ ఇండస్ట్రీలోకి రావడం సంతోషంగా ఉందన్న కరణ్ జొహార్
  • త్వరలో ప్రారంభం కానున్న సినిమా షూటింగ్

సౌత్ ఇండియన్ సినిమాల హవా దేశవ్యాప్తంగా నడుస్తున్న తరుణంలో... బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జొహార్ మాలీవుడ్‌పై కన్నేశారు. ఆయనకు చెందిన నిర్మాణ సంస్థ ‘ధర్మ ప్రొడక్షన్స్’, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌కు చెందిన ‘పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్’ కలిసి ఒక భారీ మలయాళ ప్రాజెక్ట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశాయి. 19వ శతాబ్దపు కేరళ జానపద కథలు, సాంస్కృతిక గాథల ఆధారంగా ‘ఓడియన్: ది ఏజ్ ఆఫ్ ఇల్యూజన్’ (Odiyan: The Age of Illusion) అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కబోతోంది.


ధర్మ ప్రొడక్షన్స్ మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుండటం సంతోషంగా ఉందని కరణ్ జొహార్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. పృథ్వీరాజ్‌ ప్రొడక్షన్స్‌తో తమకున్న పాత అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, మలయాళ స్క్రీన్‌పై ఈ కథను ప్రెజెంట్ చేయడం గర్వంగా ఉందన్నారు.


కేరళ పురాణాల్లోని రూపం మార్చుకునే ఒక మాయా శక్తి.. ఒక బలమైన మాతృస్వామ్య కుటుంబంపై విరుచుకుపడటం, ఆ తర్వాత సత్యానికి-భ్రమకు మధ్య జరిగే భీకర పోరాటం చుట్టూ ఈ కథ సాగుతుందని తెలుస్తోంది. 

‘భూతకాలం’, ‘భ్రమయుగం’ వంటి సినిమాలతో జానపద, హారర్ కథలను సరికొత్తగా ఆవిష్కరించిన దర్శకుడు రాహుల్ సదాశివన్ ఈ ప్రాజెక్ట్‌ను హ్యాండిల్ చేస్తున్నారు. ఈ తరం సినిమాలో జానపద కథలను భయంకరంగా, ఇంట్రెస్టింగ్‌గా చూపించడంలో రాహుల్ స్టైల్ అద్భుతమని కరణ్ ప్రశంసించారు.

ఇక ఈ బలమైన ఇతిహాసంలో పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు లేడీ సూపర్ స్టార్ మంజు వారియర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.

Karan Johar
Prithviraj Sukumaran
Odiyan The Age of Illusion
Rahul Sadasivan
Manju Warrier
Dharma Productions

More Telugu News